ఈ రిజల్ట్ ను అస్సలు ఊహించలేదు... హార్థిక్..!

Pulgam Srinivas
"ఐ పీ ఎల్ 2024" లో భాగంగా హార్దిక్ పాండ్యా "ముంబై ఇండియన్స్" జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంవత్సరం "ఐ పి ఎల్" సీజన్ ప్రారంభం కాక ముందు ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన అంచనాల నడుమ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగినప్పటికీ పేలవమైన ప్రదర్శనను కనబరుస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలో మూడు మ్యాచ్ లను ఆడింది.


ఇందులో మూడింటిలోనూ ఈ జట్టు ఓడిపోయింది. ఇకపోతే నిన్న ముంబై ఇండియన్స్ ... రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో కచ్చితంగా ముంబై ఇండియన్స్ జట్టు గెలిచి ఈ సీజన్ లో ఖాతా ఓపెన్ చేస్తోంది అని ఎంతో మంది భావించారు. కాకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు కేవలం 125 పరుగులను మాత్రమే చేసింది. దానితో చాలా తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం ఈ పరుగులను చాలా తేలికగా పూర్తి చేసి విజయాన్ని అందుకుంది. దీనితో ముంబై జట్టుకు మరో అపజయం దక్కింది. ఇక నిన్నటి మ్యాచ్ లో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ ... ఈ రిజల్ట్ ను అస్సలు ఊహించలేదు.


రాజస్థాన్ తో మ్యాచ్ ను కచ్చితంగా గెలుస్తాము అని భావించాము. కానీ మేము అనుకున్నది జరగలేదు. రాబోయే మ్యాచ్ లో మాత్రం అత్యున్నత పరదర్శనను కనబరిచి విజయాలను అందుకుంటాం అనే నమ్మకం మాకు ఉంది అని హార్దిక్ పాండ్యా తెలియజేశాడు. ఇకపోతే వచ్చే ఆదివారం ముంబై ఇండియన్స్ కు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగునుంది. మరి ఈ మ్యాచ్ లో అయిన ముంబై జట్టు గెలుపొంది పాయింట్స్ పట్టికలో ఖాతాను ఓపెన్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: