ఇప్పటికే 2024 "ఐ పి ఎల్" లో భాగంగా 14 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. అందులో భాగంగా
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రెండు మ్యాచ్ లను ఆడింది. అందులో మొదటగా కింగ్స్ 11
పంజాబ్ జట్టుతో ఈ టీం తలపడగా ఇందులో LSG మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత
రాజస్థాన్ రాయల్స్ తో ఈ టీం తలపడింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో మాత్రం విరు ఓడిపోయారు.
దానితో ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లను ఆడిన ఈ జట్టు ఒక దాంట్లో ఓడిపోయి ... ఒక దాంట్లో గెలిచి పాయింట్ల పట్టికలో పర్వాలేదు అనే స్థానంలో కొనసాగుతుంది. LSG జట్టు ఆఖరిగా
రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో తలపడింది. ఈ మ్యాచ్ కి ఈ జట్టు కెప్టెన్ అయినటువంటి కే ఎల్
రాహుల్ దూరంగా ఉన్నాడు. దానితో ఆ మ్యాచ్ కు నికోలస్ పూరన్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఈ రోజు LSG ... బెంగళూరు రాయల్ చాలెంజెస్ టీం తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7 గంటల 30 కు ప్రారంభం కానుంది.
ఇకపోతే ఈ రోజు మ్యాచ్ కి కూడా కే ఎల్
రాహుల్ దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక దీనితో LSG జట్టు కె ఎల్
రాహుల్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఒక దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ రోజు మ్యాచ్ లో కే ఎల్
రాహుల్ ఆడబోతున్నట్లు ప్రకటించాడు. ఇలా
రాహుల్ ఈ రోజు మ్యాచ్ లో ఉండబోతున్నాడు అని తెలియడంతో ఈ జట్టు అభిమానులు ఫుల్
ఖుషి అవుతున్నారు. మరి ఈ రోజు
రాహుల్ నేతృత్వంలో LSG జట్టు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.