ఇద్దరివి సేమ్ రన్స్.. కానీ కోహ్లీని కాదని పరాగ్ కి ఆరెంజ్ క్యాప్ ఎందుకిచ్చారంటే?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్  మొదలైంది. ప్రేక్షకులందరికీ అదిరిపోయే క్రికెట్ మజా దొరుకుతుంది. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ కూడా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఆటగాళ్లు  ధనాధన్ బ్యాటింగ్ తో అదరగొడుతుంటే మరోవైపు బౌలర్లు బంతులతో  నిప్పులు చేరుకుతూ బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తూ ఉన్నారు. అయితే ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్.. ఇక ఎక్కువ వికెట్లు పడగొట్టిన ప్లేయర్ కి పర్పుల్  క్యాప్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.

 ఐపీఎల్ లో ఇచ్చే  ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లను సొంతం చేసుకోవడానికి ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా ఆటగాళ్లు బరిలోకి దిగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్ లో ఇప్పటికే అటు విరాట్ కోహ్లీ అత్యధిక పరుగుల వీరుడుగా కొనసాగుతూ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. కాగా ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం ఏకంగా కోహ్లీ తన ఆరెంజ్ క్యాప్ ను కోల్పోయాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్.. ఇలా కోహ్లీ నుంచి ఆరెంజ్ క్యాప్ ని లాగేసుకున్నాడు.

 ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో విరాట్ కోహ్లీ రియాన్ పరాగ్ ఇద్దరు కూడా 181 పరుగులతో టాప్ స్కోరర్లుగా కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయినప్పటికీ అటు విరాట్ కోహ్లీని కాదని రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఆరెంజ్ క్యాప్ ధరించాడు. అయితే ఇలా రియాన్ పరాగ్ కి ఆరంజ్ క్యాప్ రావడానికి వెనుక కారణం కూడా ఉంది. రూల్స్ ప్రకారం ఇద్దరు క్రికెటర్లు ఒకేలా పరుగులు చేసి ఉన్నప్పటికీ.. అత్యధిక స్ట్రైక్ రేట్ కారణంగా రియాన్ పరాగ్ కి ఆరెంజ్ క్యాప్ దక్కింది.  పరాగ్ 160.17 స్ట్రైక్ రేటుతో  181 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లీ 140. 27 స్ట్రైక్రేటుతో అంతే పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: