ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గుర్తింపు కలిగిన క్రికెట్ ఆటగాళ్లలో ఒకరు అయినటువంటి రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్ లను ఆడి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ఈయన తన అద్భుతమైన ఇన్నింగ్స్ లతో ఇండియాకు ఎన్నో విజయాలను మరియు కప్ లను కూడా అందించాడు.
ఇకపోతే చాలా సంవత్సరాలుగా రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ముంబై ఇండియన్స్ జట్టులో ఆడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. (ఐపీఎల్) లో ఉన్న టీమ్ లలో ముంబై ఇండియన్స్ జట్టు కి భారీ క్రేజ్ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఇందులో రోహిత్ శర్మ ఉండడమే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కు ఇప్పటి వరకు ఐదు ట్రోఫీలు వచ్చాయి. కొన్ని సార్లు ఈ టీం కి ట్రోఫీ రాకపోయినా రోహిత్ నేపథ్యంలో ఈ జట్టు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడింది.
(ఐపిఎల్) లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడి ఎన్నో విజయాలను తమ టీం కి అందించిన రోహిత్ శర్మ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించడం లేదు. ఈయనను కాదు అని హార్దిక్ పాండ్యా ను ముంబై ఇండియన్స్ యాజమాన్యం కెప్టెన్ గా నియమించింది. ఇక హార్దిక్ కెప్టెన్సీ లో ముంబై ఇండియన్స్ చాలా పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది.
దానితో రోహిత్ శర్మ బాధపడుతున్నట్లు వచ్చే (ఐపిఎల్) లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడకుండా మెగా ఆక్షన్ లో రోహిత్ పాల్గొనబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజంగానే రోహిత్ శర్మ కనుక ముంబై ఇండియన్స్ జట్టును వదిలేసినట్లు అయితే ఈ టీం కు పెద్ద కష్టమే వచ్చే ఆపాయం ఉంది.