ఐపిఎలే ముద్దు.. డబ్బుకోసం ఏమైనా చేస్తారా?
ఈ మధ్యకాలంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఐపీఎల్ తరహా లోనే t20 టోర్నీలో నిర్వహిస్తున్నాయి. ఈ లీగ్ లలో అన్ని దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుండగా ఈ లీగ్ లో కూడా ఎంతో మంది విదేశీ క్రికెటర్లు బాగమయ్యారు. అయితే ఇలా భాగమైన కొంతమంది క్రికెటర్లు ఏకంగా దేశం తరపున ఆడాల్సి ఉన్నప్పటికీ.. ఇక జాతీయ జట్టును కూడా పక్కనపెట్టి ఐపీఎల్లో ఆడటానికి ఆసక్తిని చూపుతున్నారు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతో మంది క్రికెటర్లు ఇలా దేశం తరపున ఆడటం కంటే ఐపీఎల్ కి అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్న విషయం అందరికీ అర్థమైంది.
ఇక ఇప్పుడు ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఐపిఎల్ లో ఆడుతున్న 8 మంది న్యూజిలాండ్ క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని పక్కన పెట్టేశారు. పాకిస్తాన్ తో టి20 సిరీస్ ఆడేందుకు నో చెప్పేసారు. దీంతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విలియమ్సన్, రచిన్ రవీంద్ర, బౌల్డ్, పెర్గ్యూసన్, హెన్రీ, డారిల్ మిచెల్, శాంట్నర్, ఫిలిప్ లాంటి ఆటగాళ్లు ఏకంగా ఐపీఎల్ కోసం దేశాన్ని పక్కన పెట్టారు అనేది తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ఐపీఎల్ లోని వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.