ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పీ ఎల్) లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసింది. ఈ జట్టు మొదట బ్యాటింగ్ చేసి కేవలం 17.3 ఓవర్లు ముగిసే సరికి కేవలం 89 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. ఇలా చాలా దారుణమైన ఆట తీరుతో అత్యంత తక్కువ స్కోరును సాధించిన ఈ జట్టు కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 90 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఉంచగలిగింది.
ఇక దానితో అత్యల్ప టార్గెట్ తో బ్యాటింగ్ ను మొదలు పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి నుండే అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. అందులో భాగంగా కేవలం 8.5 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 92 పరుగులను చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ రోజు మ్యాచ్ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ అద్భుతంగా పెరిగింది. ఇక ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఆరు మ్యాచ్ లను ఆడగా 3 మ్యాచ్ లలో మాత్రమే గెలుపొంది ఆరు పాయింట్ లతో పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతుంది.
ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ లను ఆడి అందులో మూడింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది. ఇకపోతే ఇప్పటివ రకు గుజరాత్ టైటాన్స్ జట్టు (ఐ పి ఎల్) హిస్టరీ లోనే ఎప్పుడు కూడా 100 కంటే తక్కువ పరుగులు చేయలేదు. ఈ జట్టు చేసిన అతి తక్కువ పరుగులు ఈ రోజు ఇన్నింగ్స్ వే. ఇలా ఈ రోజు ఆట తీరుతో ఈ జట్టు ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది.