నాకు గతంలోకి వెళ్లే ఛాన్స్ ఉంటే.. నేను అదే చేస్తా : కేఎల్ రాహుల్
ఇలా సెమీఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ లో అడుగుపెట్టిన టీమిండియాకు చివరికి తుది పోరులో మాత్రం చుక్కెదురైంది. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో తప్పకుండా వరల్డ్ కప్ గెలిచి తీరుతుంది అనుకున్న అభిమానులందరికీ కూడా నిరాశ తప్పలేదు. ఈ క్రమంలోనే ఈ ఓటమితో అటు భారత క్రికెట్ మొత్తం నైరాస్యంలో మునిగిపోయింది అని చెప్పాలి. అభిమానులు కూడా ఈ ఓటమిన్ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇప్పటికీ కూడా ఈ ఫైనల్లో ఓటమి గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఇక ఇటీవల ఇదే విషయం గురించి టీం ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో తాను ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ సమయం వెనక్కి వెళ్లగలిగితే మీరు ఏ నిర్ణయాన్ని సరి చేసుకుంటారు అంటూ అశ్విన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ ఇలా బదులిచ్చాడు. ఫైనల్ లో ఆస్ట్రేలియా పై నేను చివరి వరకు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది దీనివల్ల 30 నుంచి 40 పరుగులు ఎక్కువగా వచ్చేవి. ప్రపంచకప్ మా చేతుల్లో ఉండేది. దీనికి నేను ఎప్పుడూ చింతిస్తూనే ఉంటాను అంటూ కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.