టి20లలో డబుల్ సెంచరీ.. కేవలం అతనికే సాధ్యం : కేన్
ఇక కొంతమంది ప్లేయర్లు అయితే విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించి.. ఏకంగా శతకాల మోత మోగిస్తూ ఉంటారు. అతి తక్కువ బంతుల్లోనే డబుల్ సెంచరీలు చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంతో అలవోకగా శతకాలు చేయడంలో అటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో సమర్థుడు. ఇప్పటివరకు బ్యాటింగ్ లో తాను ఏం చేయగలను అనే విషయాన్ని చేసి చూపించాడు. అయితే టి20 ఫార్మట్ లో ఇప్పటివరకు ఎన్నో సార్లు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ ఇక డబుల్ సెంచరీ మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు. కానీ వన్డే ఫార్మాట్లో మూడుసార్లు డబుల్ సెంచరీలు చేయడం గమనార్హం.
డబుల్ సెంచరీ చేయగల సత్తా ఎవరికైనా ఉందా అంటే అది కేవలం రోహిత్ శర్మకు మాత్రమే ఉంది అంటూ న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ ఓపెనర్ కాబట్టి ఎక్కువ సేపు ఆడేందుకు సమయం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా అతని బ్యాడ్ నుంచి ద్విశ్శతకం రావచ్చు. ఇక ఈ ఐపీఎల్లో ఆ ఫీట్ నమోదైన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. రోహిత్ కు ఇప్పటికే వన్డే ఫార్మాట్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన అనుభవం ఉంది. కాబట్టి టి20 ఫార్మాట్లో కూడా అతనికి డబుల్ సెంచరీలు కొట్టడం అంత కష్టమైన పని కాదు అంటూ కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు.