కోహ్లీకి బిగ్ షాక్.. భారీ జరిమానా?
ఇక ఇప్పటివరకు పలువురు ఆటగాళ్లకు అంపైర్లతో వాగ్వాదానికి దిగడం కారణంగా జరిమానా పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం ఇలా జరిమానా పడే పరిస్థితి వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. తాను అవుటైన బంతి నడుము కంటే పైకి వచ్చిందని నోబాల్ గా ఎందుకు ప్రకటించలేదు అంటూ ఎంపైర్లని అడిగాడు కోహ్లీ. ఇదే విషయంపై తన కోపాన్ని ఆపుకోలేక వారితో కాసేపు వాగ్వాదం చేశాడు అని చెప్పాలి. ఇలా ప్రవర్తన నియమలిని ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్.
విరాట్ కోహ్లీ కి భారీ జరిమానా విధించింది అని చెప్పాలి. ఇటీవల కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో ఎంపైర్లతో వాగ్వాదానికి దిగిన కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 50% కోత వేసింది ఐపీఎల్ అడ్వైజరీ. అయితే అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ డూప్లెసిస్ కూడా భారీ జరిమానా విధించింది అన్న విషయం తెలిసిందే. ఇలా కోహ్లీకి జరిమానా పడిన విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది