ఐపీఎల్ లో ఆ రూల్ తీసేయాలి.. సిరాజ్ షాకింగ్ కామెంట్?
ఇక ఒక ఆటుగాడు బ్యాటింగ్ పూర్తయిన వెంటనే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా మైదానం బయటికి వెళ్లిపోవడం ఇక కొత్తగా జట్టులోకి బౌలర్ రావడం జరుగుతుంది అయితే ఈ రూల్ కారణంగా బౌలింగ్ ఆల్రౌండర్లకి అన్యాయం జరుగుతుంది అంటూ గత కొంతకాలం నుంచి వాదన వినిపిస్తుంది. ఈ రూల్ విషయంలో బీసీసీఐ ఒకసారి పునరాలోచించుకోవాలి అంటూ క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన టీమిండియా ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సైతం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలను తొలగించాలి అంటూ డిమాండ్ చేశాడు మహమ్మద్ సిరాజ్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేయాలి బౌలర్లకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. బ్యాట్స్మెన్లు రాగానే విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ 270- 280 పరుగులు పరిపాటిగా మారిపోయాయి అంటూ మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక అతను చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై అంతకంతకు విమర్శలు పెరిగిపోతున్నాయ్.