తెలుగు క్రికెటర్ తిలక్ పై.. పాండ్యా సంచలన విమర్శలు?

praveen
ఒకప్పుడు భారత క్రికెట్లో చెప్పుకొద్దుగా తెలుగు క్రికెటర్లు చాలా తక్కువగా ఉండేవారు  ఎప్పుడో ఓసారి మాత్రమే తెర మీదకి వచ్చి కొన్నాళ్లపాటు ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త ఎక్కువ మంది తెలుగు క్రికెటర్లు భారత క్రికెట్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉండటం గమనార్హం. అయితే కొంతమంది భారత జట్టు తరఫున అదరగొడుతూ ఉంటే ఇంకొంతమంది ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇలా గత కొంతకాలం నుంచి తన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న తెలుగు క్రికెటర్లలో తిలక్ వర్మ కూడా ఒకరు. ఐపీఎల్ లో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు తిలక్. అయితే గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగి జట్టు మొత్తం పూర్తిగా విఫలమైన సమయంలో కూడా తిలక్ వర్మ తన ఫామ్ ఎంతో చూపించాడు. ఇలా దాదాపు గత మూడు సీజన్స్ నుంచి కూడా ముంబై జట్టుకు కీలక ఆటగాడిగా మారిపోయాడు.  ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్లోను మంచి ప్రదర్శనలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి.

 ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఒకవైపు వికెట్లు పడుతున్న తిలక్ కర్మ మాత్రం క్రేజీలో పాతుకుపోయాడు 33 బంతుల్లో 63 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఇలాంటి మంచి ఇన్నింగ్స్ ఆడిన తిలక్ పై కెప్టెన్ హార్దిక్ విమర్శలు చేసాడు. ఢిల్లీ చేతిలో ఓటమికి ఎన్నో కారణాలు ఉన్న అటు తెలుగు కుర్రాడు తిలక్ కారణమని హార్థిక్ పాండ్యా అనడం చర్చనీయాంశంగా మారింది. 8 ఓవర్ లో అక్షర పటేల్ బౌలింగ్కు వచ్చారు. ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన తిలక్ వర్మ ఆ ఓవర్లు దూకుడుగా ఆడాల్సింది కానీ తొలి నాలుగు బంతులకు సింగిల్స్ తీశారు. అక్కడే మ్యాచ్ పోయింది అంటూ హార్దిక్ విమర్శించాడు. అయితే ఇలా కేవలం ఒక్క ఆటగాడివి హార్దిక్ టార్గెట్ చేసి  ఇలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: