ఎంత బాగా రాణిస్తున్నా.. వరల్డ్ కప్ లో మాత్రం సెలెక్ట్ చేయలేదు?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన ఇటీవల పూర్తయింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ జట్టులో ఏ ఆటగాళ్ళు చోటు సంపాదించుకుంటారు అనే ఉత్కంఠకు తెరపడింది అని చెప్పాలి. అయితే ఐపీఎల్లో బాగా రాణించిన యువ ఆటగాళ్లకు కూడా t20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుంది అని ఎంతో మంది విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఊహించని రీతిలో ప్రస్తుతం ఐపీఎల్  లో రాణిస్తున్న ఆటగాళ్ళను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. ఇక ఇప్పటికే టీమ్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లకు మాత్రమే ఛాన్సులు ఇచ్చారు అని చెప్పాలి.

 అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ టోర్నీలో తప్పకుండా చోటు సంపాదించుకుంటాడు అని అందరూ ఊహించిన ఆటగాళ్లలో రింకు సింగ్ కూడా ఒకరు. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్ నుంచి అతను ఒక సూపర్ స్టార్ గా ఎదిగాడు. టీమిండియా తరఫున కూడా అవకాశాలు దక్కించుకుంటూ సూపర్ ఫినిషింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్లో కూడా మరోసారి తన బ్యాటింగ్ తో విద్వాంసాన్ని సృష్టిస్తున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నాడు. దీంతో అతనికి టి20 వరల్డ్ కప్ జట్టులో తప్పకుండా చోటు దక్కుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఊహించని రీతిలో సెలెక్టర్లు రింకు సింగ్ కి షాక్ ఇచ్చారు అని చెప్పాలి.

 ఎందుకంటే ఖచ్చితంగా టి20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకుంటాడు  అనుకున్న ఆటగాడు.. ఇక ఎప్పుడు మాత్రం రిజర్వ్  ఆటగాళ్ల లిస్టులో చేరిపోయాడు. రింకు సింగ్కు బదులు శివం దూబే, సంజు  లాంటి హిట్టర్లకు చోటు దక్కింది  అయితే ఈ నెల 25 వరకు కూడా జట్టులో మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక రింకు సింగ్ జట్టులోకి వస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే అతను భారత వరల్డ్ కప్ జట్టులోకి రింకు రావాలని అభిమానులు అందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: