ఐపీఎల్ : ఆ రెండు జట్లు ప్లే ఆఫ్ నుండి నిష్క్రమించినట్లేనా?

praveen
ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఐపిఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ అటు అభిమానులు అంచనాలు మొత్తం తారుమారు చేశాయి అన్న విషయం తెలిసిందే. అలాంటి జట్లలో అటు ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఒకటి. అయితే ఇప్పటికే ఐదు సార్లు టైటిల్ విన్నింగ్ టీమ్ గా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో బరిలోకి దిగింది. దీంతో ఆ జట్టు అద్భుతంగా రానించి మరో టైటిల్ గెలుచుకుంటుందని అందరూ అనుకున్నారు.

 మరోవైపు పదహారేళ్ల ఐపీఎల్ సీజన్ లో ఆర్సిబి ఒకసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ  ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మహిళల ఆర్సిబి జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఇక ఐపీఎల్లో కూడా కోహ్లీ సేన ఇదే రీతిలో విజయం సాధిస్తుంది  టైటిల్ గెలుచుకుంటుంది అని అందరూ ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు  కానీ ఈ రెండు టీమ్స్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో చెత్త ప్రదర్శన చేస్తున్నాయి. ఇప్పటివరకు పది మ్యాచ్ లు ఆడిన ఈ రెండు జట్లు చరో మూడు విజయాలు మాత్రమే సాధించి ఇక చివరి నుంచి తొలి రెండు స్థానాలలో కొనసాగుతున్నాయ్ అని చెప్పాలి. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు టీమ్స్ కి ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు అయినట్లే.

 అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కోసం తీవ్రమైన పోటీ ఉండగా.. ఇక ఇప్పటికే ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాయ్ అనేది తెలుస్తుంది. ఇప్పటికే 10 మ్యాచ్లు ఆడాయి. ఈ రెండు జట్లు కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించాయి. అయితే ఇంకా మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అయితే మిగిలిన నాలుగు మ్యాచ్లలో అదృష్టం కొద్దీ నాలుగింటిలో గెలిచినప్పటికీ కేవలం 14 పాయింట్లు మాత్రమే అవుతాయి. ప్లే ఆఫ్ కి అర్హత సాధించాలంటే.. ఏకంగా 16 పాయింట్లు సాధించాలి దానికి తోడు ఇక ఈ రెండు టీమ్స్ కి రన్ రేట్ కూడా తక్కువగానే ఉంది అని చెప్పాలి. దీంతో ఈ ఐపిఎల్ సీజన్ లో ఈ రెండు టీమ్స్ దాదాపు ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: