ముంబై ఈరోజు ఓడిందా.. ఇక అంతే?
గత కొన్ని సీజన్స్ నుంచి కూడా వరుసగా విఫలమౌతూ వస్తున్న ముంబై ఇండియన్స్.. ఇక ఈసారి రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగింది. కొత్త కెప్టెన్ తో అయినా ఆ జట్టుకు అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటే.. అది జరగడం లేదు. ఇక ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ప్లే ఆఫ్ లో చోటు దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది అని చెప్పాలి. కానీ ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్ లోకి వెళ్లడానికి ఇంకా కాస్త అవకాశం ఉంది. అయితే నేడు ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతాతో తడబడబోతుంది.
అయితే ఇలా కోల్కతా జట్టుతో ముంబై ఇండియన్స్ కి డూ ఆర్ డై మ్యాచ్ గా మారబోతుంది అని చెప్పాలి. టేబుల్ లో చివరి నుంచి రెండో ప్లేస్ లో ఉన్న ముంబై ఇండియన్స్.. ఇక టేబుల్ లో మొదటి నుంచి రెండో ప్లేస్ లో ఉన్న కోల్కతాతో మ్యాచ్ ఆడబోతుంది ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది అంటే ముంబై ఇండియన్స్ కి ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా అడుగంటి పోతాయి అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాలి. ఆ జట్టు ఆడబోయేది కేవలం మరో నాలుగు మ్యాచ్లు మాత్రమే కావడంతో దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలు ముగిసిపోయాయి. కానీ ఇతర జట్లకు గెలుపు ఓటములపై ముంబై ప్లే ఆఫ్ ఛాన్సులు ఆధారపడి ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ ఆశలు వదులుకోవాల్సిందే.