టి20 లలో.. ఆర్సిబి కెప్టెన్ అరుదైన రికార్డ్?
అట్టడుగు స్థానం నుంచి ఒకసారిగా ఏడో స్థానానికి వచ్చి చేరింది. అయితే ఇలా చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆర్సిబి ఒక సాలిడ్ విజయాన్ని సాధించడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు. అయితే ఇక రానున్న మ్యాచ్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు చేస్తే ఆ జట్టుకు ప్లే ఆఫ్ లోకి వెళ్లేందుకు అవకాశాలు కొంచెం మెరుగుపడే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ ను 147 పరుగులకే కట్టడి చేసిన ఆర్సిబి ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా అదరగొట్టింది. మరీ ముఖ్యంగా కెప్టెన్ డూప్లెసిస్ ఇక మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లో 64 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే ఆర్సిబి తరఫున రెండవ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అదే సమయంలో డూప్లెసిస్ టి20 ఫార్మాట్లో ఒక అరుదైన ఘనత కూడా సాధించాడు. పొట్టి ఫార్మాట్లో పదివేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న 14వ ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఈ లిస్టులో అగ్రస్థానంలో క్రిస్ గేల్ 14,562 పరుగులతో టాప్ లో ఉన్నాడు. తర్వాత షోయబ్ మాలిక్ 13600, కీరన్ పొలార్డ్ 12900 పరుగులతో ఉన్నారు అని చెప్పాలి. అయితే rcb విజయంతో అభిమానులు అందరిలో కూడా జోష్ నిండింది. తర్వాత మ్యాచ్లలో కూడా ఇలాగే రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.