ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఇప్పటి వరకు ఈ సీజన్ లో 11 మ్యాచులను ఆడగా అందులో ఎనిమిది మ్యాచ్ లలో గెలుపొంది మూడింట్లో ఓడిపోయి 16 పాయింట్లు పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఈ సీజన్లో 11 మ్యాచ్ లు ఆడగా అందులో ఎనిమిది మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్ లలో ఓడిపోయి 16 పాయింట్స్ తో పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో 11 మ్యాచులు ఆడగా ఆరింట్లో గెలిచి ఐదు మ్యాచ్లలో ఓడిపోయి 12 పాయింట్లతో 3 వ స్థానంలో కొనసాగుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడగా అందులో ఆరు మ్యాచులలో గెలిచి , 5 మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడగా అందులో ఆరింటిలో గెలిచి , ఆరింటిలో ఓడిపోయి 12 పాయింట్లతో అయిదవ స్థానంలో ఉంది. లక్నో జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి 6 మ్యాచ్ లలో గెలిచి ఐదు మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్లతో 6 వ స్థానంలో ఉంది.
ఇక బెంగళూరు జట్టు 11 మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు గెలిచి ఏడు మ్యాచ్ లలో ఓడిపోయి 8 పాయింట్లతో ఏడవ స్థానంలోనూ , కింగ్స్ 11 పంజాబ్ 11 మ్యాచులు ఆడగా నాలుగింట్లో గెలిచే ఏడింట్లో ఓడిపోయి ఎనిమిది పాయింట్లతో ఎనిమిదవ స్థానంలోనూ , ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది పాయింట్లతో 9వ స్థానంలోనూ గుజరాత్ జట్టు ఎనిమిది పాయింట్లు తో పదవ స్థానంలోనూ కొనసాగుతుంది.