ఐపీఎల్ లో.. నేడు మరో డూ ఆర్ డై మ్యాచ్?

praveen
దాదాపు గత నెలన్నర రోజుల నుంచి అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ అలరిస్తూ వస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు ఓటర్ల పండుగ.. ఇంకోవైపు క్రికెట్ పండుగ కొనసాగుతోంది. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే ఇంకోవైపు ఇక ఐపీఎల్ లోని ప్రతి మ్యాచ్ కూడా ప్రతిరోజు ఎంటర్టైన్మెంట్ పంచుతుంది  అయితే ఇలా నెలన్నర రోజులుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వచ్చిన ఐపీఎల్ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది  ప్లే ఆఫ్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో అన్ని టీమ్స్ కూడా అలర్ట్ అయిపోయాయి.

 ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా గెలుపే లక్ష్యంగా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి. ఇక పాయింట్లు పట్టికలో ఎట్టి పరిస్థితుల్లో తొలి నాలుగు స్థానాలలో నిలువడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పటికే అటు కోల్కతా జట్టు 18 పాయింట్లు సాధించి టాప్ లో కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్ కి కూడా క్వాలిఫై అయిపోయింది. మరోవైపు ముంబై, పంజాబ్ జట్లు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. దీంతో మిగిలిన మూడు స్థానాలలో నిలిచేందుకు మిగతా టీమ్స్ అని కూడా పోటీ పడుతున్నాయి.

 కొన్ని టీమ్స్ డు ఆర్ డై మ్యాచ్ లు ఆడుతున్నాయి అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో భాగంగా నేడు కోల్కతా, గుజరాత్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ కూడా గుజరాత్ టీం కి డూ ఆర్ డై మ్యాచ్ గా మారిపోయింది. ఎందుకంటే కోల్కతా ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరింది. గుజరాత్ కి మాత్రం ఇది చావో రేవో అన్న పరిస్థితి. ఈరోజు ఓడితే గుజరాత్ జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది  అయితే ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ పై వారి హోమ్ గ్రౌండ్ లో గెలిచి జోరు మీద ఉన్న గుజరాత్ అటు టేబుల్ టాపర్ కోల్కతాను ఢీకొట్టగలగా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: