ఐపీఎల్ 2024 లో భాగంగా ఇప్పటికే అనేక మ్యాచ్లు పూర్తి అయ్యాయి. అందులో కొన్ని అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిచి ఇప్పటికే ప్లే ఆప్స్ లోకి ఎంటర్ అయితే మరికొన్ని జట్లు పేలవమైన ప్రదర్శనను కనబరిచి ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలను పూర్తిగా కోల్పోయాయి. ఇక పోతే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండి కాస్త అటు ఇటు అయితే ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్న జట్లుగా సన్రైజర్స్ హైదరాబాద్ , ఆర్సీబీ ప్రస్తుతం ఉన్నాయి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ లను ఆడి 14 పాయింట్లతో పాయింట్ల పత్రికలో నాలుగో స్థానంలో ఉండగా , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 13 మ్యాచుల్లో 12 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఇకపోతే ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ కి వెళ్ళాలి అంటే ఏమి జరగాలి అనే విషయాలను తెలుసుకుందాం.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 12 మ్యాచ్ల్ లలో 7 మ్యాచ్ లలో గెలిచింది. దానితో 14 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఈ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్ మరియు పంజాబ్ జట్టులతో తలపడబోతోంది. ఈ రెండు మ్యాచ్ లు గెలిచినట్లు అయితే సన్రైజర్స్ జట్టు ప్లే ఆప్స్ కి వెళుతుంది. ఒకటి గెలిచినా కూడా ప్లే ఆప్స్ కి వెళ్లే అవకాశాలు ఈ జట్టుకు ఉన్నాయి. ఒక వేళ రెండు మ్యాచ్ లలి కనుక ఈ జట్టు ఓడినట్లు అయితే ఇతర జట్ల ఫలితాలపై ఈ టీం ఆధారపడవలసి ఉంటుంది.
ఇక బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను అదగా అందులో ఆరు మ్యాచ్ లలో గెలిచి 12 పాయింట్లతో ఉంది. ఈ జట్టుకు కేవలం ఇంకా ఒకే ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ బెంగళూరు, చెన్నై తో ఆడనుంది. ఇక ఈ జట్టు ప్లే ఆప్స్ కి వెళ్ళాలి అంటే సన్రైజర్స్ హైదరాబాద్ , లక్నో , ఢిల్లీ జట్లలో రెండు జట్లు నిష్క్రమించాలి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడే మ్యాచ్ లో ఈ జట్టు 18 పరుగుల తేడాతో చెన్నై ని ఓడించాలి , లేదా 18.1 ఓవర్లలో మ్యాచ్ ను చేదించాలి. ఇలా జరిగినట్లు అయితే బెంగుళూరు ప్లే ఆప్స్ కి వెళుతుంది.