ఢిల్లీ గెలిచిన ఓడినట్లేనా..?

Pulgam Srinivas
నిన్న (ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా ఢిల్లీ మరియు లక్నో మధ్య మ్యాచ్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఎందుకు అంటే వీరిద్దరు కూడా ప్లే ఆఫ్ కి వెళ్ళలేదు. అలాగే నిన్నటి మ్యాచ్ లో ఎవరు అయితే గెలుస్తారో వారికి ప్లే ఆఫ్ ఆశలకి బలం చేకూరుతాయి అని. దానితో మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొన్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 209 పరుగులు చేసింది.

ఇలా మొదట బ్యాటింగ్ చేసి భారీ కోర్ ను సాధించిన ఈ జట్టు తమ ఆపోజిట్ టీమ్ అయినటువంటి లక్నో కి 210 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. భారీ పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన లక్నో జట్టు మంచి స్కోర్ అనే సాధిస్తూ వచ్చినప్పటికీ 20 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 189 పరుగులు మాత్రమే చేసి ఓటమి ని అందుకుంది. ఇక లక్నో ఓడిపోవడంతో ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఈ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ లు ఉంటే 14 ఆడేసింది. అందులో ఏడింట్లో గెలిచి , ఏడింట్లో ఓడిపోయి 14 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.  

లక్నో జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను ఆడి 6 మ్యాచ్ లలో గెలిచి , ఏడింట్లో ఓడిపోయి 12 పాయింట్ లతో పాయింట్స్ పత్రికలో 7 వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదవ స్థానంలో ఉన్నా కూడా ప్లే ఆప్స్ కు వెళ్లే అవకాశాలు చాలా వరకు లేవు అని చెప్పవచ్చు. పాయింట్ల పట్టికలో ఈ జట్టు కంటే ముందు ఉన్న నాలుగు జట్లలో ఏ జట్టు అయిన రన్ రేట్ కారణంగా వెనకబడితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఈ సీజన్ లో ప్లే ఆఫ్ కి వెచ్చే ఛాన్స్ ఉంది. మరి దాదాపుగా అది అసంభవం అని చెప్పవచ్చు. మరి చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆప్స్ కి వెళుతుందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dc

సంబంధిత వార్తలు: