ఇండియా క్రికెట్ టీం లో అత్యంత క్రేజ్ కలిగిన ఆటగాళ్లలో ఎమ్మెస్ ధోని ఒకరు. ఈయన ఇండియా జట్టులోకి బ్యాటర్ కం వికెట్ కీపర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ధోని తనదైన అద్భుతమైన ఆట తీరుతో బ్యాటింగ్ లో రాణించడం మాత్రమే కాకుండా వరల్డ్ లోనే ఎవరు చేయలేనంత గొప్ప స్థాయిలో కీపింగ్ ను చేసి ఇండియాకు తన బ్యాటింగ్ తో కీపింగ్ తో కూడా ఎన్నో విజయాలను అందించాడు. అలా తన అద్భుతమైన ఆట తీరుతో జట్టును , బీ సీ సీ ఐ బోర్డును , ప్రేక్షకులను మెప్పించిన ధోనీ కి ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఇక ఈయన నేతృత్వంలో ఇండియా జట్టు 50 - 50 వరల్డ్ కప్ , టీ 20 వరల్డ్ కప్ మరియు మరికొన్ని ట్రోఫీలు కూడా వచ్చాయి. ఈయన ఆ తర్వాత కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు.
అలాగే కొన్ని సంవత్సరాల క్రితమే ఈయన ఇండియన్ టీం నుండి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ధోని కేవలం ఐ పి ఎల్ మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఐ పీ ఎల్ నుండి కూడా మరికొన్ని సంవత్సరాలలోనే ధోని తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం ధోని తనకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ యూఎస్ అని ఓ ఈవెంట్ లో భాగంగా చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఆయన యూఎస్ ప్రాంతాన్ని అంతగా ఇష్టపడడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా..? అక్కడ గోల్ఫ్ ఆడడం , ఫుడ్ తినడం , రెస్ట్ తీసుకోవడం తప్ప వేరే ఏ పని ఉండదంట. అలాగే తన ఫ్రెండ్స్ ఇంటి నుంచి 2 నిమిషాల 30 సెకండ్ ల లోనే గోల్ఫ్ ఆడే ప్లేస్ కు వెళ్ళచ్చట , అలాగే అక్కడ లోకల్ టోర్నమెంట్ లలో కూడా ధోని పాల్గొంటాడట. అక్కడ ఎంతో ఎంజాయ్ ఎంజాయ్ గా ఉంటుందట. అందుకే అక్కడ 15 నుండి 20 రోజులు తనకు బెస్ట్ గా అనిపిస్తుంది అని అందుకే యూఎస్ తన బెస్ట్ ట్రావెల్ టెస్ట్ నేషన్ అని ధోనీనే స్వయంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.