పూరన్ విధ్వంసం.. అరుదైన రికార్డ్?
అయితే ఇటీవల ipl లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్,ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. కాగా గత కొంతకాలం నుంచి వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఇక చివరి మ్యాచ్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుంది అని అభిమానులు అనుకున్నారు. కానీ అది కూడా చేయలేకపోయింది ఎందుకంటే లక్నో చేతిలో 18 పరుగులు తేడాతో ఓటమి చూసింది ముంబై ఇండియన్స్. చివరికి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే కొనసాగి టోర్ని నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్ లో లక్నో విధ్వంసకర ఆల్రౌండర్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ విధ్వంసం సృష్టించాడు.
అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏకంగా 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఈ హాఫ్ సెంచరీ తో అరుదైన రికార్డు కూడా సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో 20 బంతుల్లోపు అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇటీవల ముంబై తో జరిగిన మ్యాచ్లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ రికార్డు నమోదు చేశాడు. కాగా నికోలస్ పూరన్ ఇప్పటివరకు 20 బంతుల్లో మూడుసార్లు ఇలా హాఫ్ సెంచరీ మార్కులు అందుకున్నాడు అని చెప్పాలి. ఇక అతడి కంటే ముందు ఢిల్లీ ఓపెనర్ ప్రెషర్ మేక్ గార్క్, హైదరాబాద్ స్టార్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ఈ ఘనతను అందుకున్నారు.