సన్రైజర్స్ ప్లేయర్ ఊచకోత.. 26 బంతుల్లో సెంచరీ?
అంతర్జాతీయ క్రికెట్ లో అనుభవం ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ల దగ్గర నుంచి అప్పుడప్పుడే క్రికెట్లో మెలకువలను నేర్చుకుంటున్న కొత్త ఆటగాళ్ల వరకు అందరూ ఐపీఎల్ సీజన్లో బ్యాటింగ్ విధ్వంసం అంటే ఏంటో చూపించారు. మరి ముఖ్యంగా సన్రైజర్స్ ఆటగాళ్లు అయితే ఎలాంటి ఆట తీరును కనపరిచారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే యువ ఆటగాడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఊచకోత గురించి భారత క్రికెట్ ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అతను అద్భుతంగా రాణించిన నేపథ్యంలో వరల్డ్ కప్ లో చోటు దక్కుతుంది అనుకున్నప్పటికీ అలా జరగలేదు.
ఇలా ఐపీఎల్లో సన్రైజర్స్ తరఫున అదరగొట్టేసిన అభిషేక్ శర్మ ఇటీవల మరో మెరుపు సెంచరీ చేశాడు. గురుగ్రామ్ లో జరిగిన క్లబ్ మ్యాచ్ లో కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తూ సంచలనం సృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ యువ విధ్వంసకర ప్లేయర్ ఏకంగా 26 బంతుల్లోనే 13 పరుగులు చేశాడు. అతను ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు 14 సిక్సర్లు ఉన్నాయి అంటే అతని ఊచకోత ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. 396 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇది అధికారిక మ్యాచ్ కాకపోయినప్పటికీ ఇక అతను మెరుపు సెంచరీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.