ఆ ఇద్దరే.. టీమ్ ఇండియాను గెలిపించారా?
అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఒక ఓవర్ ముగిగానే వర్షం అంతరాయం కలిగించింది. దీంతో దాయాదుల పోరు జరుగుతుందా లేదా అనే విషయంపై అందరిలో ఆందోళన నెలకొంది. అయితే ఈ పోరును చూసేందుకు స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో వరుణుడు కరుణించడంతో మళ్ళీ మ్యాచ్ మొదలైంది. అయితే వర్షం తర్వాత మ్యాచ్ జరగగా.. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 119 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో ఇన్నాళ్లు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఇండియా పైచేయి సాధించినా.. ఈసారి మాత్రం పరాజ్యం తప్పదు అని అందరూ అనుకున్నారు.
కానీ టీమ్ ఇండియా ఎలాగోలా గెలవాలని కోరుకునే అభిమానులు కూడా కోట్లలోనే ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లో స్కోరింగ్ మ్యాచ్లో పాకిస్తాన్ పై అటు టీమిండియా విజయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. మరి ముఖ్యంగా టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కొనసాగుతున్న బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఇక మరోవైపు హార్థిక్ పాండ్యా 24 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. వీరిద్దరి విజృంభనతో టీం ఇండియా.. లో స్కోరింగ్ గేమ్ లో కూడా విజయం సాధించగలిగింది.