అదే జరిగితే.. పాక్ వరల్డ్ కప్ ఆడాలంటే.. ముందు క్వాలిఫైయర్స్ ఆడాలి?
ఈ క్రమంలోనే పాకిస్తాన్ కనీసం సూపర్ 8 కి అయిన క్వాలిఫై అవుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ సూపర్ 8 కి చేరాలంటే ఆ జట్టు ప్రదర్శన మీద కాదు మాత్రమే కాదు యూఎస్ఏ జట్టు గెలుపు ఓటమిల మీద కూడా భవితవ్యం ఆధారపడి ఉంది అని చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్ సూపర్ హిట్ కు చేరకుండా వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమిస్తే మరింత హీనస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2026 t20 వరల్డ్ కప్ ఎడిషన్ కు అర్హత సాధించాలంటే.. పాకిస్తాన్ క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ సభ్య దేశమైన పాకిస్తాన్ గతంలో ఎప్పుడు కూడా క్వాలిఫైయర్ ఆడలేదు.
కానీ ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఆ జట్టుకు అంతకంటే అవమానం మరొకటి ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు . అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే ఏ లెక్కన చూసినా పాకిస్తాన్ జట్టు సూపర్ 8 కి అర్హత సాధించడం మాత్రం అసాధ్యంగానే కనిపిస్తుంది ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం ఈ టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కి అర్హత సాధించిన జట్లే వచ్చే ప్రపంచ కప్ కి నేరుగా అర్హత సాధిస్తాయి. ఇక మిగతా టీమ్స్ అన్నీ కూడా ముందు క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడి ఆ తర్వాత వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే గత ప్రపంచ కప్ వరకు టి20 ర్యాంకింగ్స్ ఆధారంగానే ఇలా వరల్డ్ కప్ ఆడే జట్లను నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయ్. ఈ రూల్స్ అటు పాకిస్తాన్ కు శాపంగా మారే అవకాశం ఉంది.