పాపం పాక్.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ జట్టులో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి తెగిన టీమ్స్ లో పాకిస్తాన్ కూడా ఒకటి. అయితే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో తీవ్రంగా నిరాశపరిచిన పాకిస్తాన్.. ఈ వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం అద్భుతంగా రానించి తీరుతుంది అని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించనీ రీతిలో ఆ జట్టు మరోసారి నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే.

 మొదటి మ్యాచ్ లో చిన్న టీం అయినా యూఎస్ఏ చేతిలోనే ఓడిపోయి తీవ్ర నిరాశలో మునిగిపోయిన పాకిస్తాన్.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థిగా పిలుచుకునే భారత్ చేతిలో కూడా ఓడిపోయింది. అయితే ఇలా వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో   పాకిస్తాన్ కు సూపర్ 8 కి అర్హత సాధించే అవకాశాలు చివరికి కష్టంగ మారిపోయాయి అని చెప్పాలి. దీంతో ఆ జట్టు గెలుపు పై మాత్రమే కాకుండా ఇతర జట్ల గెలుపు ఓటములపై కూడా పాకిస్తాన్ భవితవ్యం ఆధారపడింది. అనుకున్న గణాంకాలు నమోదు కాకపోవడంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

 అయితే ఇలా వరుసగా ఓటములు చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ జట్టు నామమాత్రమైన మ్యాచ్లో మాత్రం విజయం సాధించింది. ఐర్లాండ్తో జరిగిన పోరులో మూడు వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది  ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో   106/9 చేసింది. లక్ష్య చేదనలో మొదట పాకిస్తాన్ తడబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకొని 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.అయితే ఈ విజయం గురించి తెలిసి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం  అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు ఫ్యాన్స్. ఈ వరల్డ్ కప్ పరాజయం తర్వాత ఆ జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: