WCలో ఘోర పరాభవం.. ఫ్యాన్స్ కి భయపడి స్వదేశానికి వెళ్ళని బాబర్?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు పాకిస్తాన్ జట్టు ఎంత దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈసారి వరల్డ్ కప్ టోర్నీలో తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుంది అని ఆ దేశ అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయింది పాకిస్తాన్ టీం.

 ఏకంగా వరుస పరాజయాలతో దారుణమైన ఓటమినీ చవి చూసింది. ఎంతలా అంటే ఏకంగా మాజీ ఛాంపియన్ హోదాతో వరల్డ్ కప్ టోర్నీలో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు.. కనీసం సూపర్ 8 కి కూడా అర్హత సాధించలేదు. ఏకంగా చిన్న టీమ్స్ సూపర్ 8లో అడుగుపెడితే.. పాకిస్తాన్ లాంటి మాజీ ఛాంపియన్ మాత్రం లీగ్ దశతోనే చివరికి ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆ జట్టుపై తీవ్ర స్థాయిల విమర్శలు వస్తున్నాయి. ఆ జట్టులో ఏ ఒక్క ఆటగాడు జట్టుగా టీం కోసం ఆడటం లేదు అంటూ ఏకంగా ఆ జట్టు హెడ్ కోచ్ చేసిన కామెంట్స్ కూడా సంచలనంగా మారిపోయాయి.

 అయితే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన నేపథ్యం లో ఇక ఆ దేశ ఆటగాళ్ళందరూ కూడా స్వదేశానికి చేరుకున్నారు. కానీ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ మాత్రం ఇంకా స్వదేశానికి వెళ్ల లేదట. అమెరికా నుంచి నేరుగా యూకేకి వెళ్లినట్లు తెలుస్తోంది. అతని తో పాటు అమీర్ ఇమాద్, హరీష్ రావూఫ్, షాదాబ్, ఆజామ్ ఖాన్ లు కూడా అభిమానుల ఆగ్రహానికి భయపడి స్వదేశానికి వెళ్లకుండా యూకేకి వెళ్లారట. కొన్నాళ్లు అక్కడే ఉండి తర్వాత పాకిస్తాన్ కు వెళ్తారని సమాచారం. ప్రస్తుతం యూకే లోకల్ లీగ్స్ లో ఆడాలని ఇక ఆయా పాకిస్తాన్ క్రికెటర్లు భావిస్తున్నట్లు పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: