వరల్డ్ కప్ ముగిశాక.. భారత్ ముందు ఏ దేశ పర్యటనకు వెళ్ళిబోతుందో తెలుసా?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా మ్యాచ్లు ఆడుతూ టీమ్ ఇండియా ఎంత బిజీ బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు తగ్గట్లుగానే వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఏకంగా లీగ్ దశ మ్యాచ్ లలో వరుసగా అన్ని మ్యాచ్ లలో ఘనవిజయాన్ని అందుకున్న భారత జట్టు సూపర్ 8 లో కూడా అర్హత సాధించింది.

 అయితే యుఎస్ లో ఉన్న స్లో పిచ్లపై అటు పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి జట్లే తడబడి లీగ్ దశతోనే టోర్ని నుంచి నిష్క్రమిస్తే    అటు భారత జట్టు మాత్రం అద్భుతంగా రానించి ప్రత్యర్థులపై పూర్తిస్థాయి పైచేయి సాధించింది అని చెప్పాలి  ఇంకా ఇప్పుడు సూపర్ 8 లో కూడా మెరుగైన ప్రదర్శన చేసి ఇక వరల్డ్ కప్ టైటిల్ పోరులో మరింత ముందుకు వెళ్లేందుకు టీమ్ ఇండియాస్ సిద్ధమైంది అని చెప్పాలి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో టైటిల్  గెలవడంలో ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన ఈసారి మాత్రం ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తపడుతోంది.

 అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు మొదట ఏ దేశ పర్యటనకు వెళ్లబోతుంది అన్నది కూడా హార్ట్ టాపిక్ గా మారిపోయింది. జింబాబ్వే పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం జట్టును అనౌన్స్ చేనున్నట్లు సమాచారం. కాగా జింబాబ్వేతో భారత్ 5 t20 ల సిరీస్ ఆడబోతుంది  ఇక ఈ మ్యాచ్ లు అన్నీ కూడా హరారే లో జరగబోతున్నాయి అన్నది తెలుస్తుంది  జూలై ఆరవ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ సిరీస్ జరగబోతుందట. అయితే ఇక ఇప్పటికే వరల్డ్ కప్ ఆడే సీనియర్ ఆటగాళ్లు అందరూ అలసిపోయిన నేపథ్యంలో ఇక టీమిండియా బి టీమ్ తో జింబాబ్వే పర్యటనకు వెళ్లబోతుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: