T20 WC : అదే జరిగితే.. ఆస్ట్రేలియా ఇంటికే?
సూపర్ ఇంట్లో భాగంగా ఇప్పటివరకు ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ లతో జరిగిన మ్యాచ్లో.. ఘనవిజయాన్ని అందుకున్న టీమిండియా.. ఇక ఇప్పుడు నేడు జరగబోయే మ్యాచ్లో ఆస్ట్రేలియాను సైతం ఓడించి ఇక అదరగొట్టాలని భావిస్తుంది. ఈ విజయం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. కాగా నేడు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు పటిష్టమైన టీమ్స్ కావడంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ నిపుణులు. అయితే ఇలా జరిగితే ఆస్ట్రేలియా ఇంటికి వెళ్లడం ఖాయమే అంటూ ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.
టి20 వరల్డ్ కప్ లో ఇటీవల సూపర్ 8 దశలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో ఆ జట్టుకు సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టంగా మారిపోయాయి. ఒకవేళ నేడు అటు భారత జట్టుతో జరగబోయే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే కొన్ని సమీకరణాలు కలిసి వస్తే చివరికి ఆస్ట్రేలియాను భారత జట్టు ఇంటికి పంపించడంలో సక్సెస్ అవుతుంది. భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం కాదు.. బంగ్లాదేశ్ పై ఆఫ్గనిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియా టోర్ని నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇలా జరిగితే సూపర్ 8 లో గ్రూప్ వన్ లో ఇండియా 6, ఆఫ్ఘనిస్తాన్ 4 పాయింట్ లతో సెమిస్ చేరుతాయి. ఒకవేళ ఇండియాపై ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై బంగ్లాదేశ్ గెలిస్తే ఇండియా, ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో ఉంటాయి అని చెప్పాలి.