చరిత్ర సృష్టించిన రోహిత్.. ఇండియన్ క్రికెట్ లో మొదటి కెప్టెన్?

praveen
టీమిండియా కెప్టెన్ గా  కొనసాగుతున్న రోహిత్ శర్మ ఎంత అద్భుతమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటివరకు అతని కెరియర్లో సాధించిన ఘనతలు కూడా అన్ని ఇన్ని కావు.ఇక భారత జట్టుకు పిల్లర్ గా కొనసాగుతూ కెప్టెన్ గా  జట్టును ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు.. ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎప్పుడు భారత జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ.

 ఇక ప్రస్తుతం 2024 t20 వరల్డ్ కప్ ఎడిషన్ లో కూడా కెప్టెన్ గా అతను సూపర్ సక్సెస్ అవుతున్నాడు. భారత జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ అందరిని ఫిదా చేసేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్లలో కూడా విజయం సాధించి సెమీఫైనల్ వరకు చూసుకుంది. కాగా ఇటీవల సూపర్ 8 లో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో ఘనవిజయాన్ని సాధించడం ద్వారా ఇలా సెమి ఫైనల్ బెర్త్ ని కన్ఫార్మ్ చేసుకుంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో రోహిత్ శర్మ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 92 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరిని ఫిదా చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

 ఈ క్రమంలోనే ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద్వారా ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించాడు అని చెప్పాలి. t20 ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న తొలి భారత కెప్టెన్గా హిట్ మాన్ రికార్డర్ సృష్టించాడు. ఇప్పటివరకు భారత జట్టుకు టి20 ఫార్మాట్ లో ఎంతో మంది కెప్టెన్సీ వహించినప్పటికీ ప్రపంచ కప్ లో మాత్రం ఒక్క కెప్టెన్ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోలేకపోయారు. కానీ రోహిత్ మాత్రం ఆ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 41 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. దీంతో అతనికి ఈ అవార్డు వరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: