నితీష్ రెడ్డికి బంపర్ ఆఫర్.. కానీ దురదృష్టం అంతే ఇదే?
మరి ముఖ్యంగా తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి వచ్చిన అవకాశాన్ని ఎంతలా సద్వినియోగం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఇక అదరగొట్టేస్తున్నాడు. తన బ్యాటింగ్ తో ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలాగానే ఆడుతూ అందరిని మైమరిపించాడు. ఈ క్రమంలోనే అతి త్వరలోనే అతను భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అందరు అనుకున్నారు. ఊహించినట్లుగానే అటు జింబాబ్వే పర్యటన కోసం భారత సెలెక్టర్లు నితీష్ రెడ్డికి జట్టులో ఛాన్స్ కల్పించారు. ఇలా తక్కువ సమయంలోనే బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు ఈ ప్లేయర్.
కానీ ఇలా లక్కీ ఛాన్స్ దక్కించుకున్న ఈ తెలుగు ప్లేయర్ ను అటు దురదృష్టం కూడా వెంటాడింది అన్నది తెలుస్తుంది ఎందుకంటే జింబాబ్వే పర్యటనకు భారత జట్టులో తొలిసారి చోటు దక్కించుకున్న తెలుగు ప్లేయర్ నితీష్ రెడ్డి.. చివరికి గాయం కారణంగా జట్టుకు దూరం కాబోతున్నాడట. నితీష్ రెడ్డి గాయం కారణంగా జింబాబ్వే తో జరగబోయే టి20 సిరీస్లో ఆడటం లేదు అని బీసీసీఐ వెల్లడించింది. ఇక అతని ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. కాగా నితీష్ రెడ్డికి గాయం కావడంతో అతని స్థానంలో శివం దుబేకి జింబాంబే పర్యటనలో ఆడే ఛాన్స్ దక్కబోతుంది అన్నది సమాచారం.