ఏంటీ.. టీమిండియా దగ్గర ఉంది ఒరిజినల్ ట్రోఫీ కాదా?

praveen
భారత జట్టు ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా రానించి ఎన్నో ఏళ్ల కలను నెరవేర్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి వరల్డ్ కప్ టోర్నీలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. కీలకమైన మ్యాచ్ లలో మాత్రం కాస్త తడబాటుకు గుడువుతూ చివరికి ప్రపంచ కప్ టైటిల్ని గెలుచుకోలేక పోతుంది టీమిండియా. చివరికి వరల్డ్ కప్ గెలవాలని ఆశను నెరవేర్చుకోలేక పోతుంది. ఇక అభిమానులను సైతం నిరాశ పరుస్తూ వస్తుంది అనే విషయం తెలిసిందే.

అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నిలో కూడా టీమిండియా ఇలాగే అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కానీ ఇటీవల వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో మాత్రం అద్భుతంగా సత్తా చాటింది రోహిత్ సేన. మొదటి మ్యాచ్ నుంచే జైత్రయాత్రను ప్రారంభించిన టీమిండియా.. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లింది. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా ను ఓడించి చివరికి టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. t20 వరల్డ్ కప్ టైటిల్ తో స్వదేశానికి చేరుకున్నారు.

 ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఇక వరల్డ్ కప్ తో ఫోటోలు కూడా దిగారు. అంతేకాదు ముంబైలో ట్రోఫీతో రోడ్ షో కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు t20 వరల్డ్ కప్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది  ప్రస్తుతం టీమిండియా వద్ద ఉంది ఒరిజినల్ ట్రోఫీ కాదట. ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫోటోషూట్ కోసం మాత్రమే అందిస్తారట. విజేతలు తమ దేశాలకు తీసుకెళ్ళేందుకు అచ్చం అలాంటిదే ఇయర్ ఈవెంట్ లోగో తో డూప్లికేట్ సిల్వర్ వేర్ టోపీని ఐసిసి తయారుచేసి ఇక గెలిచిన టీం సభ్యులకు అందజేస్తుందట. అటు అసలు ట్రోఫీని మాత్రం దుబాయిలోనే ఐసీసీ కార్యాలయంలోనే ఉంచుతారట. ప్రతి ఏడాది వరల్డ్ కప్లలో ఇలాంటిదే జరుగుతూ ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: