అలాంటోడు.. ప్రతి జనరేషన్ కు ఒక్కడే ఉంటాడు : కోహ్లీ
మొదటి మ్యాచ్ నుంచి కూడా వరుస విజయాలు సాధిస్తూ జైత్రయాలను కొనసాగించిన టీమిండియా.. ఒక్క ఓటమి కూడా లేకుండా వరల్డ్ కప్ టైటిల్ సాధించేసింది. దీంతో వరల్డ్ క్రికెట్లో ఒక నయా హిస్టరీ క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఇక భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇకపోతే ఇక ఇటీవల వరల్డ్ కప్ టైటిల్ తో స్వదేశానికి చేరుకున్న టీమిండియాను.. అటు బీసీసీఐ ఘనంగా సత్కరించ్చింది. అదే సమయంలో టీమిండియా ఆటగాళ్లందరూ ట్రోఫీతో ముంబైలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో కి జన సందోహం తరలివచ్చారు అన్న విషయం తెలిసిందే.
అదే సమయంలో ఇక వాంఖడే స్టేడియంలో అభిమానులందరికీ కూడా అభివాదం చేశారు టీమిండియా క్రికెటర్లు. ఇక ఈ సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక బౌలర్ అయిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. బుమ్రా లాంటివాడు ప్రతి జనరేషన్ కు ఒక్కడే ఉంటాడు అంటూ కోహ్లీ అన్నాడు. అతడు చాలా కాలం పాటు జట్టుకు ఆడాలని తనతో పాటు చాలామంది కోరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు అప్పటి జట్టులోని సీనియర్ల ఎమోషన్స్ నాకు అర్థం కాలేదని.. కానీ అప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఎమోషనల్ ఫీల్ అయ్యారు అన్న విషయం ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.