జింబాబ్వేతో టి20 సిరీస్.. ఇండియన్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్?
ఇలా సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా బిజీగా ఉండగా.. మరోవైపు యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కెప్టెన్సీలో అటు జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది టీమిండియా. ఈ క్రమంలోనే జింబాబ్వేతో ఐదు మ్యాచ్లో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టి20 సిరీస్ కోసం ఇప్పటికే కెప్టెన్ గిల్ తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా జింబాబ్వే చేరుకున్నారు. కాగా నేడు హరారే స్పోర్ట్స్ క్లబ్లో సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సిరీస్ కంటే ముందు అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. దీంతో ఇది తెలిసి అందరూ నిరాశలో మునిగిపోతున్నారు.
జింబాబ్వే టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ ను ప్రపంచకప్ మ్యాచ్లను చూసినట్లుగా మొబైల్లో ఉచితంగా చూడలేరు. అయితే ఈ సిరీస్ లోని అన్ని మ్యాచ్లను ఉచితంగా టీవీలో చూసేందుకు అవకాశం ఉంది. కానీ మొబైల్లో మాత్రం అన్ని మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చూడలేరు. ఎందుకంటే ఇది చూడాలి అంటే తప్పకుండా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సోనీ లీవ్ యాప్ లో రూ.399 నుంచి 149 రూపాయల వరకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఈ మ్యాచ్ మొబైల్ లేదా లాప్టాప్లలో ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు అవకాశం ఉంటుంది. కాగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ విషయం తెలిసి టీమిండియా ఫ్యాన్స్ షాక్ లో మునిగిపోతున్నారు.