ఏంటీ బాసు ఇది.. ఓపెనర్ గా మారిన అశ్విన్?

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతో ఇక వరల్డ్ క్రికెట్లో అతను ఒక లెజెండ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ క్రికెట్లో అశ్విన్ ను మించిన తెలివైన బౌలర్ మరొకరు లేరు అనేంతలా తన ఆటతో ప్రభావితం చేశాడు అని చెప్పాలి. ఇక టీమిండియా తరఫున టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన వీరుడుగా కూడా అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ ఒక్కటేనా ఇప్పటివరకు అశ్విన్ ఖాతాలో ఇలాంటి అరుదైన రికార్డులు చాలానే ఉన్నాయి.

 అయితే ఒకప్పుడు అశ్విన్ బౌలర్ అని మాత్రమే అందరూ తెలుసుకునేవారు. కానీ ఇక టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న చాలాసార్లు అతను బ్యాటింగ్ తో కూడా ఆదుకున్నాడు. అంతేకాదు బ్యాటర్ గా అతని ఖాతాలో ఒక టెస్ట్ సెంచరీ కూడా ఉంది. దీంతో అతన్ని స్పిన్ ఆల్ రౌండర్ అని పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. ఇలా కేవలం బౌలింగ్ తో మాత్రమే కాదు బ్యాటింగ్ తో కూడా అదరగొడుతూ జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా ఆదుకుంటూ ఉంటాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇక అందరూ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు అవుట్ అయిన తర్వాత అశ్విన్ బ్యాటింగ్ చేయడానికి రావడం ఇప్పటివరకు ఎన్నోసార్లు చూశాం.

 కానీ ఇప్పుడు ఈ స్టార్ స్పిన్నర్ ఏకంగా ఓపెనర్ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు. ఇక ఈ టోర్నీలో దుండిగల్ డ్రాగన్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు అశ్విన్. ఇకపోతే ఇటీవల తిరుచ్చి గ్రాండ్ చోలాస్ తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ గా బలిలోకి దిగాడు రవిచంద్రన్ అశ్విన్. కానీ ఐదు పరుగులకే ఔట్ అయ్యి నిరాశపరిచాడు. అయితే ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ లో అశ్విన్ కు చోట దక్కలేదు అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి అశ్విన్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుంది అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో అతని స్థానంలో చాహల్ ను సెలక్టర్లు ఎంపిక చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: