టీమిండియాకు 125 కోట్ల నజరానా.. ఒక్కో క్రికెటర్ కు రూ. 5కోట్లే?

praveen
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడింది అన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు 2011లో ధోని కెప్టెన్సీలో గెలుచుకునే వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇక ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది టీమిండియా. కెప్టెన్లు మారినా టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని కల మాత్రం నెరవేరలేదు అని చెప్పాలి. అయితే ఇటీవలే 2024 t20 వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియా ప్రపంచకప్ గెలవ గలిగింది.

ఇంకా ఈ వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వెళ్లిన టీమిండియా అక్కడ కూడా గెలిచి ఇక టైటిల్ని ముద్దాడగలిగింది. ఇలా 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది అని చెప్పాలి. దీంతో 140 కోట్ల మంది భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానని పరికటించింది.  ఏకంగా 125 కోట్లను బహుమతిగా అందించింది.

 ఈ క్రమంలోనే వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను సన్మానించేందుకు ముంబైలోనే వాంకడే స్టేడియంలో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ స్పెషల్ ఈవెంట్లో బీసీసీఐ సెక్రెటరీ జై షా ఏకంగా టీమిండియా ఆటగాళ్లకు 125 కోట్ల రూపాయలు చెక్కును అందజేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని జట్టులోని 15 మంది సభ్యులకు సమానంగా పంచబోతున్నారు. అదే సమయంలో కోచింగ్ సిబ్బందికి కూడా ఈ డబ్బులు వెళ్ళపోతున్నాయి. అయితే లెక్క ప్రకారం ఇక ఒక్క ఆటగాడికి 5 కోట్లు దక్కుతున్నాయట. 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి ఐదు కోట్లు, కోచ్ ద్రావిడ్ కి ఐదు కోట్లు, ఇక మిగిలిన కోచ్ లకు 2.5 కోట్ల చొప్పున అందుకుంటారు. బ్యాక్ రూమ్ స్టాప్ తల రెండు కోట్లు, సెలక్షన్ కమిటీ మిగతా  సభ్యులు, రిజర్వ్ ప్లేయర్లు కోటి రూపాయల నజరానని అందుకుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: