శ్రీలంకతో వన్డే సిరీస్.. రోహిత్, కోహ్లీ దూరం?

praveen
మొన్నటి వరకు భారత జట్టు వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ తో బిజీ బిజీగా గడిపింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా జట్టు.. అద్భుతమైన ప్రదర్శన చేసింది  ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా.. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ విజేతగా నిలవడం చేసింది. దీంతో 13 ఏళ్ల నిరీక్షణకు తరలించుతూ ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది.

 ఇలా వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకు అటు ఇండియా చేరుకోగానే ఘన స్వాగతం లభించింది అని చెప్పాలి. ఇకపోతే మొన్నటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లతో బిజీబిజీగా గడిపిన టీమిండియా.. ఇక ఇప్పుడు మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీ కాబోతుంది  అయితే టీమిండియా ఒకవైపు వరల్డ్ కప్ ఆడుతున్న సమయంలోనే ఇంకోవైపు యంగ్ టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లి.. అక్కడ టి20 సిరీస్ ఆడుతుంది.  కాగా ఇక ఇప్పుడు సీనియర్లతో కూడిన టీమిండియా జట్టు వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది  వచ్చే నెలలో శ్రీలంకతో మూడు మ్యాచ్లు వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది అని చెప్పాలి. అయితే ఈ వన్డే సిరీస్ కు కీలక ప్లేయర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దూరం కాబోతున్నారు అని తెలుస్తుంది.

 అయితే వీరిద్దరితోపాటు అటు బుమ్రా కూడా తనకు లాంగ్ బ్రేక్ కావాలని బీసీసీఐ పెద్దలను కోరినట్లు సమాచారం  ఈ సిరీస్ కి కేఎల్ రాహుల్  లేదా హార్దిక్ పాండ్యాలను కెప్టెన్గా నియమించి అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. మరోవైపు శ్రేయస్, రిషబ్ పంతులు ఇక ఈ సిరీస్ తో మళ్ళీ టీమిండియాలోకి వన్డే ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశం ఉందట. ఇకపోతే మొన్నటికి మొన్న వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన రోజే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: