15 బంతుల్లో సెంచరీ.. కొట్టింది మన తెలుగోడే?
అయితే ఒకప్పుడు ఇలా భారత క్రికెట్లో తెలుగు ప్లేయర్లు పెద్దగా కనిపించే వాళ్ళు కాదు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు ప్లేయర్లు సైతం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ సహ ఏకంగా టీమ్ ఇండియాలో కూడా వరుసగా చాన్సులు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇక యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ రెడ్డి లాంటి వాళ్లు ఇక తాము టీమిండియా ఫ్యూచర్ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. కాగా ఇప్పుడు మరో తెలుగు క్రికెటర్ తెరమీదకి వచ్చాడు. తన మెరుపు బ్యాటింగ్ తో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అదిరిపోయే హాఫ్ సెంచరీ చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.
ఆ ప్లేయర్ ఎవరో కాదు ప్రశాంత్.వైజాగ్ వేదికగా జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో సంచలన హాఫ్ సెంచరీ నమోదయింది. బెజవాడతో జరిగిన మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ బ్యాట్స్మెన్ ప్రశాంత్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేసాడు. దీంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇక అతను ఇన్నింగ్స్ లో ఓకే ఓవర్ లో 4 6 6 6 4 6 తో ఏకంగా 32 పరుగులు బాదేశాడు అని చెప్పాలి. మొత్తంగా ఈ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ 171 పరుగులు చేయగా.. చివరికి భారీ తేడాతో బెజవాడ జట్టు పై విజయం సాధించింది. కాగా ప్రశాంత్ మెరుపు హాఫ్ సెంచరీ పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.