మందు పార్టీ వల్లే.. శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ ఓడిందట తెలుసా?
వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మకమైన టోర్నిని ఆడేందుకు వచ్చినట్లు కాదు ఏకంగా విదేశాలకు టూర్ వచ్చారేమో అన్న విధంగా ఆయా జట్ల ఆట తీరు కొనసాగింది అని చెప్పాలి. ఏకంగా ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం వారి సొంత జట్టు పైన విమర్శలు చేసేంతలా కొన్ని టీమ్స్ ప్రస్థానం కొనసాగింది. ఇలా చెత్త ప్రదర్శన చేసి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన జట్లలో అటు శ్రీలంక కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. చెత్త ప్రదర్శన కారణంగా కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టలేకపోయింది శ్రీలంక. గ్రూప్ దశతోనే టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే.
ఇలా గ్రూప్ దశ నుంచి శ్రీలంక జట్టు వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో. ఇక తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయ్ అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు శ్రీలంక జట్టు గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్ కప్ టోర్నీలో కీలకమైన మ్యాచ్ కు ముందు ఆటగాళ్లు ఏకంగా మందు పార్టీ చేసుకున్నారు అంటూ ఒక మీడియా సంచలన కథనం వెలువరించింది. దీనిని శ్రీలంక క్రికెట్ బోర్డు ఖండించింది. అమెరికాలో అలాంటి ఘటనలేవి జరగలేదు అంటూ స్పష్టం చేసింది. తమ దేశ క్రికెట్ ప్లేయర్లను అప్రతిష్టపాలు చేయడానికి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది.