గంభీర్ కు షాక్.. అతని డిమాండ్ కు ఒప్పుకొని బీసీసీఐ?
అయితే బీసీసీఐ ఇలా గౌతమ్ గంభీర్ ను కొత్త హెడ్ కోచ్ గా నియమించిన నేపద్యంలో.. అసిస్టెంట్ కోచ్ లను కూడా తానే నియమించుకుంటాను అంటూ బీసీసీఐ ముందు ఒక డిమాండ్ పెట్టాడు గౌతమ్ గంభీర్. ఈ క్రమంలోనే ఇందుకు అటు బీసీసీ పెద్దలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా అటు గౌతమ్ గంభీర్ అసిస్టెంట్లుగా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారు అనే విషయంపై గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే తన అసిస్టెంట్ కోచ్ కోసం ఏకంగా ఒక పేరును ప్రతిపాదించగా బీసీసీఐ గౌతమ్ గంభీర్ డిమాండ్ ని తోసి పుచ్చింది అని సమాచారం.
ఇటీవల అసిస్టెంట్ కోచ్ కోసం ఒక ప్రతిపాదనను బీసీసీఐ ముందు ఉంచాడట గంభీర్. ఫీల్డింగ్ కోచ్గా సౌత్ ఆఫ్రికా దిగ్గజం అయిన జాంటీ రోడ్స్ ని తీసుకోవాలని గౌతమ్ గంభీర్ బీసీసీఐ పెద్దలను కోరాడట. కానీ ఇందుకు అటు బీసీసీఐ నిరాకరించింది అని తెలుస్తుంది. దీనికి కారణం కేవలం స్వదేశీ కోచ్ లు మాత్రమే ఉండాలని బిసిసిఐ భావిస్తుంది. అందుకే గౌతమ్ గంభీర్ విదేశీ మాజీ ప్లేయర్ను ఇక తన అసిస్టెంట్ గా పెట్టుకుంటాను అని చెప్పడంతో ఇందుకు బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. మరి గౌతమ్ గంభీర్ కు అసిస్టెంట్లుగా ఎవరూ రాబోతున్నారు అనే విషయంపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.