షాకింగ్ : కోహ్లీకి ఆ విషయాన్ని చెప్పని బీసీసీఐ?

praveen
టీమిండియాకు మెయిన్ పిల్లర్లు కీలక ప్లేయర్లు ఎవరు అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పేర్లు మొదట వినిపిస్తూ ఉంటాయి. ఈ ఇద్దరు టీమ్ ఇండియాలో సీనియర్ ప్లేయర్లు మాత్రమే కాదు.. ఇక ఈ తరానికి లెజెండరి ప్లేయర్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే జట్టును విజయతీరాలకు నడిపించడంలో ఈ ఇద్దరు ప్లేయర్లు ఎప్పుడు ముందుంటారు. ఇక టీమ్ ఇండియాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా కోహ్లీ,  రోహిత్ శర్మ లకు ముందుగా బీసీసీఐ సెలెక్టర్లు సైతం సమాచారం అందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అంతలా ఇద్దరు ప్లేయర్ల ప్రభావం జట్టుపై కొనసాగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతూ ఉండగా అంతకుముందు విరాట్ కోహ్లీ సారధిగా ఎన్నో ఏళ్లపాటు టీం ఇండియాను ముందుకు నడిపించాడు అని చెప్పాలి. ఇలా టీమ్ ఇండియాను ఎప్పుడు నిలబెట్టే రెండు పిల్లర్లుగా ఈ ఇద్దరు కొనసాగుతున్నారూ. అలాంటిది ఏకంగా విరాట్ కోహ్లీకి ఇటీవల టీమిండియాలో జరిగిన ఒక కీలక మార్పు విషయంలో ఎలాంటి సమాచారం అందలేదట. భారత హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఇటీవల కొత్త కోచ్ ను నియమించారు అన్న విషయం తెలిసిందే.


 కొత్త కోచ్ గా టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే ఇలా గౌతమ్ గంభీర్ ను నూతన ప్రధాన కోచ్ గా నియమించే విషయాన్ని టీమ్ ఇండియాలో సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీకి అసలు చెప్పలేదట. టీ20 కెప్టెన్ రేసులో ముందున్న హార్దిక్ పాండ్యకు ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రమే బీసీసీఐ ఈ విషయంపై ముందుగా సమాచారం అందించిందట. అయితే విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ల మధ్య గతంలో ఎన్నో వివాదాలు ఉండడం.. దానికి తోడు ఇప్పుడు విరాట్ కోహ్లీ జట్టులో కేవలం ఒక ఆటగాడు మాత్రమే కావడంతో చెప్పనక్కర్లేదు అని అనుకున్నారట బీసీసీఐ అధికారులు. ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: