నాకు రూ. 24.75 కోట్లు ఇచ్చారు.. కానీ కోల్కతా జట్టు పరిస్థితి చూసి జాలిసింది?
మొదటి మ్యాచ్ నుంచి ఇక భారీగా పరుగులు సమర్పించుకుంటూ వికెట్లు పడగొట్టలేక విఫలమౌతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఆటగాడి కోసమా అంత పెద్ద మొత్తంలో భారీ ధరను కోల్కతా జట్టు పెట్టింది అంటూ ఏకంగా ఫ్రాంచైజీ పై కూడా విమర్శలు వచ్చాయి. అయితే చివరి మ్యాచ్ లలో స్టార్క్ పుంజుకున్నాడు. ఏకంగా ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించిన తీరు అమోఘం అని చెప్పాలి. ఇక అతను అద్భుతంగా రాణించడంతోనే కోల్కతా జట్టు ఐపిఎల్ టైటిల్ గెలుచుకోగలిగింది. మూడోసారి ట్రోఫీ విజేతగా నిలవగలిగింది అని చెప్పాలి.
అయితే ఇక ఇప్పుడు మిచెల్ స్టార్క్ కి వేలంలో 24.75 కోట్ల ధర పలికింది. కానీ అతనికి ఓ విషయంలో ఆశ్చర్యం వేసిందట. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు మిచెల్ స్టార్క్ కావడం గమనార్హం. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ బౌలర్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నాకు ఐపీఎల్ వేలంలో 24.75 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. నాకే అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేశారని అక్కడ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెక్కుల పంపిణీ అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైంది. అక్కడ వాతావరనం చూసిన తర్వాత నా ఉత్సాహం తగ్గిపోయింది. విజేతగా నిలిచిన కోల్కతాకు చెక్కు అందించారు. నాకు వేలంలో చెల్లించిన దాని కంటే కోల్కతా జట్టుకు తక్కువ దక్కింది. 20 కోట్లు మాత్రమే ప్రైస్ మనీ వచ్చింది. ఇక ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను అంటూ మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.