వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్లో... టీమిండియా చాంపియన్గా నిలిచింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో... వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్ అందుకుంది టీమిండియా. రెండు రోజు అర్ధరాత్రి వరకు... ఈ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా తలపడ్డాయి. అనూహ్యంగా... టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో.. ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది టీమిండియా.
ఇంగ్లాండ్ దేశంలోని బర్మింగ్ హామ్ లో...ఈ మ్యాచ్ జరిగింది.ఇందులో మొదట బ్యాటింగ్ తీసుకున్న.. పాకిస్తాన్ ఛాంపియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ వి కె నష్టానికి కేవలం 156 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్లో... పాకిస్తాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ మాత్రమే రాణించి 36 పరుగులు చేశాడు. ఇటు భారత జట్టులో... అనురీత్ సింగ్... పాకిస్తాన్ నడ్డి విరిచాడు.
ఈ మ్యాచ్ లో... ఏకంగా మూడు వికెట్లు తీసి... పాకిస్తాన్ భారతం పట్టాడు. హర్భజన్ సింగ్, పవన్ నేగి, అలాగే వినయ్ కుమార్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. అనంతరం చేజింగ్ కు దిగిన ఇండియా ఛాంపియన్స్... 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. 159 పరుగులు చేసి... ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇండియా ఛాంపియన్స్ లో అంబటి రాయుడు 30 బంతుల్లో 50 పరుగులు చేసి రాణించాడు.
అలాగే... యూసఫ్ పఠాన్ 30 పరుగుల తో మెరిశాడు. ఇక... యువరాజ్ సింగ్ కెప్టెన్ గా.. 15 పరుగులు చేసి నాటౌట్ గా లేచి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ తరుణంలోనే తన కెప్టెన్సీ లో ఇండియాకు కప్పు తీసుకొచ్చాడు. తన వయసు పెరిగినా కూ డా.... సత్తా తగ్గాలేదని యువరాజ్ సింగ్ మరోసారి నిరూపించాడు. పంజాబ్ సింహమా మజాకానా అని అనుకునేలా యూవీ సత్తా చాటాడు.