ధోని జిడ్డు బ్యాటింగ్ వల్లే వరల్డ్ కప్ ఓడిపోయాం : గంగూలీ

praveen
ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే టీమ్ ఇండియా.. ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ అదృష్టం కలిసి రాక.. ఇక ఓటమిపాలై టోర్న నుంచి నిష్క్రమిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ప్రపంచకప్ టోర్నీలో ఓడిపోయినప్పుడల్లా అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతూ ఉంటారు. ఇలా ఫ్యాన్స్ అందరిని కూడా ఎక్కువగా బాధపెట్టే ఓటములలో 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమి ఒకటి అని చెప్పాలి. సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 18 పరుగులు తేడాతో ఓడిపోయింది.

 అప్పటివరకు వరుస విజయాలు సాధిస్తూ అదరగొట్టిన టీమిండియా సెమీఫైనల్ లో కూడా గెలిచి ఫైనల్ అడుగుపెడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో చివరికి భారత జట్టుకు ఓటమి తప్పులేదు. అయితే రెండు రోజులపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన భారత్ 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత పంత్, హార్దిక్లు ఇన్నింగ్స్ ను నిర్మించే ప్రయత్నం చేసిన భారీ షాట్లు ఆడి వికెట్లు కోల్పోయారు. 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా ఓటమికి చేరువైంది.

 ఇలాంటి సమయంలోనే రవీంద్ర జడేజా మహేంద్రసింగ్ ధోని అసాధారణ బ్యాటింగ్ తో టీమ్ ఇండియా శిబిరంలో ఆశలు రేకెత్తించారు. ఒకవైపు జడేజా దూకుడుగా హాఫ్ సెంచరీ పూర్తి చేస్తే మరోవైపు ధోని స్లోగా బ్యాటింగ్ చేశాడు. జడేజా సిక్సర్లు ఫోర్లతో చెలరేగుతూ ఉంటే.. ధోని మాత్రం సింగిల్స్ కి పరిమితం అయ్యాడు. 12 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ధోని సింగిల్స్ కి పరిమితం అవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 49 ఓవర్ తొలిబంతిని సిక్సర్ గా తరలించిన ధోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్ మూడో బంతికి డబుల్ తీసే సమయంలో రన్ అవుట్ అయ్యాడు. దీంతో 219  పరుగులకు కుప్పకూలిన టీమిండియా 18 పరుగులు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆ సమయంలో కామెంటెటర్ గా ఉన్న సౌరబ్ గంగూలీ ధోని జిడ్డు బ్యాటింగ్ కారణంగానే టీమిండియా మ్యాచ్లో ఓడిపోయింది అని చెప్పుకొచ్చాడు. అతని వ్యూహాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. దాటిగా ఆడాల్సిన సమయంలో సింగిల్స్ తీయడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: