హార్దిక్ నీకు హ్యాట్సాఫ్.. ఆరు నెలల్లో ఎంత మార్పు?
అందుకే అతనికి ఎప్పుడు కూడా భారత జట్టులో చోటును కల్పిస్తూ ఉంటారు సెలెక్టర్లు. కొన్ని కొన్ని సార్లు ఫామ్ లో లేనప్పుడు కూడా అతన్ని భారత జట్టులోకి సెలక్ట్ చేసి సెలక్షన్ కమిటీ సైతం విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ టోర్నీకి ముందు వరకు కూడా హార్దిక్ కెరియర్ అంత సాఫీగా సాగలేదు. గాయం కారణంగా ఎన్నో రోజులపాటు టీం ఇండియాకు దూరమయ్యాడు. ఆ తర్వాత నేరుగా ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆటగాడిగా మాత్రమే కాదు కెప్టెన్ గా కూడా అతను రానించలేకపోయాడు. గత ఆరు నెలల నుంచి వరుసగా గాయాల బారిన పడుతున్న హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ ఫై దృష్టి పెట్టి పూర్తిగా మారిపోయాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో మాత్రమే కాదు ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్లో కూడా తగ్గేదెలా అంటున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇంస్టాగ్రామ్ లో 2023 వరల్డ్ కప్ లో తాను గాయపడినప్పటిది.. t20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఫోటోని ఇటీవల పంచుకున్నాడు. అయితే హార్డ్ వర్క్ కు ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది అంటూ ఇక ఈ ఫోటో చూసి నేటిజన్స్ అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కాగా హార్దిక్ పాండ్యా ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఫ్యాన్స్ అందరు కూడా ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.