అనుకున్నదే జరిగింది.. హార్దిక్ పాండ్యా షాకింగ్ డెసిషన్?
దీంతో హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక హార్దిక్ ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేయడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయ్ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా హార్దిక్ వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా తో హార్దిక్ విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్త తెరమీదికి వచ్చింది. ఎందుకంటే నటాషా ఏకంగా తన ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు అన్నింటినీ కూడా డిలీట్ చేసింది. దీంతో హార్దిక్, నటాషా విడాకుల అంశం తెరమీదకి వచ్చింది. అయితే ఇన్నాళ్లు ఇది కేవలం ఒక పుకారు గానే మాత్రమే అందరూ అనుకున్నారు. కానీ వరల్డ్ కప్ విన్నింగ్ సమయంలో అటు నటాషా హార్దిక్ ను కలవడానికి రాకపోవడం.. కొడుకు అగస్త్య ఒక్కడే ఇక మైదానాలు కనిపించడంతో విడాకులు నిజమే అన్న విషయంపై అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు.
ఇటీవల ఈ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది భారత క్రికెటర్ హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా నటాషాలు ఇద్దరు కూడా పోస్టులు పెట్టారు. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. మా కుమారుడికి మంచి కో పేరెంట్స్ గా ఉంటాము. కష్ట సమయంలో మా గోప్యతను మీరు గౌరవిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ హార్దిక్ పాండ్యా, నటాషా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా వీళ్ళు 2020 మే 31వ తేదీన వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారి దాంపత్య బంధానికి స్వస్తి పలికారు.