హార్థిక్ పాండ్యాకు.. బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ?
అటు బీసీసీఐ ఎలక్టర్లు కూడా హార్దిక్ పాండ్యాకు వరుసగా వైస్ కెప్టెన్సీ అప్పగిస్తూ వచ్చారు. రోహిత్ రెస్ట్ తీసుకున్నప్పుడల్లా ఇక తాత్కాలిక కెప్టెన్‌గా హారతిక్ పాండ్యా అనే వ్యవహరించాడు. దీంతో రోహిత్ తర్వాత ఇక టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించబోయేది హార్దిక్ పాండ్యానే అన్న విషయాన్ని అందరూ నమ్మారు. ఇక ఇటీవల రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే అటు హార్దిక్ పాండ్యా చేతికి పూర్తిస్థాయి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో బీసీసీఐ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ ఇచ్చింది. రోహిత్ తర్వాత ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్న హార్దిక్ కనీసం వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకుండా ఒకసాదాసీదా ఆటగాడు గానే పరిమిత చేసింది.
టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ వరకు రోహిత్ కు డిప్యూటీగా కొనసాగిన హార్దిక్ పాండ్యా ఇటీవల శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో ఒక సాదాసీదా ఆటగాడు గానే ఉన్నాడు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ కు t20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. అదే సమయంలో కనీసం హార్దిక్‌కు వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. వైస్ కెప్టెన్ గా యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ కు అవకాశం కల్పించింది. వన్డేలు t20 లకు కూడా గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించడం గమనార్హం. దీంతో హార్దిక్ పాండ్యా కు బిగ్ షాక్ తగిలింది అని చెప్పాలి.