భారత్ vs పాకిస్తాన్ జరిగేది నేడే.. డోంట్ మిస్?
నేడు అంటే జులై 19 శ్రీలంకలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మహిళల ఆసియా కప్ టీ20 2024 టోర్నీలో రెండో మ్యాచ్. మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్ బలమైన జట్టు. ఇప్పటివరకు జరిగిన నాలుగు టోర్నీల్లో మూడు గెలిచింది. 20 మ్యాచ్‌ల్లో 17 విజయాలు సాధించి టోర్నీలోనే అత్యుత్తమ జట్టుగా నిలిచింది. ఈ విజయంతో భారత్ జట్టు అక్టోబర్‌లో జరగనున్న ICC మహిళల టీ20 ప్రపంచ కప్‌కు సన్నద్ధంగా ఉంది.
ఈ టోర్నీ ICC మహిళల టీ20 ప్రపంచ కప్‌కు ముందు జరుగుతోంది కాబట్టి చాలా ముఖ్యమైనది. ఇరు జట్లకు ఇది ఒక గొప్ప అవకాశం. తమ బలాన్ని చాటుకోవడానికి, ప్రపంచ కప్‌కు సన్నద్ధం కావడానికి ఈ మ్యాచ్‌ను వాడుకోవాలనుకుంటున్నాయి. ఇక టీమిండియా, పాకిస్తాన్ టీమ్స్ లో మొదటిగా దిగే ఆ 11 ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం.
భారత్ 11 ప్రాబబుల్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), రిచా ఘోష్ (WK), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ ఠాకూర్, ఆశా శోబన, అరుంధతీ రెడ్డి
పాకిస్థాన్ 11 ప్రాబబుల్: సిద్రా అమీన్, ఒమైమా సోహైల్, మునీబా అలీ (వికెట్), నిదా దార్ (సి), నజిహా అల్వీ, అలియా రియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, సాదియా ఇక్బాల్, డయానా బేగ్, నష్రా సంధు
ఇప్పటిదాకా రెండు జట్లు ఆడిన మొత్తం మ్యాచ్‌లు 14. భారత్ 11 గెలిచింది. పాకిస్థాన్ 3 గెలిచింది.
ఈరోజు, జులై 19 సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేస్తారు. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.