క్రికెట్ ఆడకుండా.. అరుదైన రికార్డు సాధించిన సౌతాఫ్రికా ప్లేయర్?
ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది ఆటగాళ్లు ఇలా తమ ఆటతీరుతో అరుదైన రికార్డులు సంపాదించిన వారు ఉన్నారు. ఇంకొంతమంది ఆటతీరుతో కాకుండా ఇలా వివిధ ఫార్మాట్లలో ఆడటం ద్వారా కూడా రికార్డు సంపాదిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కూడా ఇలాంటి క్రికెటర్ గురించే. అతను ఒక అరుదైన రికార్డు సాధించాడు. అయితే క్రికెట్ ఆడటం ద్వారా కాదు ఆడక పోవడం ద్వారా అతను రికార్డు అందుకున్నాడు. అదేంటి ఆడకపోతే రికార్డు ఎలా వస్తుంది అంటారా.. ఆడక పోవడమే అతని రికార్డుకు కారణమైంది. అతను ఏకంగా టెస్ట్ ఫార్మాట్లో 91 మ్యాచ్లు ఆడాడు. కానీ ఇప్పటివరకు ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇలా జరగడంతోనే అతను అరుదైన రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ ఓపెనర్ బ్రాత్ వైట్ కి ఈ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు 91 టెస్టులు ఆడిన అతను ఒక టి20 మ్యాచ్ కూడా ఆడలేదు అని చెప్పాలి. దీంతో 50కి పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడి ఒక్క t20 కూడా ఆడని మొట్టమొదటి ఆటగాడిగా అటు వరల్డ్ క్రికెట్లో ఒక ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు బ్రాత్ వైట్. 2011 నుంచి అతను క్రికెట్ ఆడుతున్న డొమెస్టిక్ క్రికెట్లో గాని అంతర్జాతీయ క్రికెట్లో గానీ ఇప్పటివరకు ఒక్క టి20 మ్యాచ్ ఆడలేదు ఈ ప్లేయర్. మరి కెరియర్ ముగించే లోపైన టి20 ఫార్మాట్లోకి అడుగు పెడతారో లేదో చూడాలి.