హార్దిక్ కు మరో బిగ్ షాక్.. MI కెప్టెన్సీ కూడా?

praveen
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్య కెరియర్ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది అనే విషయంపైనే ప్రస్తుతం భారత క్రికెట్లో చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగడమే కాదు.. ఫ్యూచర్ కెప్టెన్ అనే ట్యాగ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ఐపీఎల్ లో అటు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా అతను సక్సెస్ అయ్యాడు. మొదటి ప్రయత్నంలోనే జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. దీంతో అతను రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్సీ కి సరైనవాడు అంటూ అందరూ మెచ్చుకున్నారు.

 ఇక టీమ్ ఇండియా సెలెక్టర్లు కూడా హార్దిక్ పాండ్యా నే ఫ్యూచర్ కెప్టెన్ అనే మెసేజ్ ఇచ్చేలా రోహిత్ కు డిప్యూటీగా అవకాశం కల్పించారు. అంతేకాదు రోహిత్ రెస్ట్ తీసుకున్నప్పుడల్లా హార్దిక్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్ గా కొనసాగాడు. దీంతో స్టార్ ఆల్ రౌండర్ టీమ్ ఇండియాకు కాబోయే ఫ్యూచర్ కెప్టెన్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక ఇప్పుడు ఈ ఊహగానాలు అన్నింటిని కూడా తుడిచిపెట్టిన బీసీసీఐ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ కు t20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో కూడా అటు హార్దిక్ పాండ్యా మరోసారి టీమిండియా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే అతనికి కనీసం వైస్ కెప్టెన్ గా కూడా ఛాన్స్ ఇవ్వలేదు బీసీసీఐ. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. వచ్చి ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్య కెప్టెన్సీ వర్షించడంపై అవమానాలు మొదలయ్యాయి. గత సీజన్లో రోహిత్ ను కాదని హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగిస్తే.. ముంబై యాజమాన్యం విమర్శలు ఎదుర్కోవడమే కాదు.. హార్దిక్ కెప్టెన్గా కూడా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో బీసీసీఐ బాటలోనే అటు ముంబై ఇండియన్స్ నడుస్తుందా లేకపోతే హార్దిక్ పాండ్యాకు మరో ఛాన్స్ ఇస్తుందా అనే విషయంపై చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: