ధోనితో అతనికి పోలికేంటి.. హర్భజన్ ఘాటు వ్యాఖ్యలు?
దీంతో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ జర్నలిస్టుపై భారత మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడితో మీ దేశ క్రికెటర్ ని పోల్చడం ఏంటి అంటూ ఇక సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్లో నాణ్యమైన ఆటగాడిగా పేరు పొందాడు మహమ్మద్ రిజ్వాన్. అయితే అతన్ని ధోనితో పోలుస్తూ ఆ దేశ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ఇది కాస్త వివాదాస్పదంగా మారిపోయింది. వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం అనే ఫోటోకి క్యాప్షన్ జోడించాడు. దీంతో ఏది కాస్త హర్భజన్ సింగ్ వరకు చేరింది.
ఈ క్రమంలోనే దీనిపై హర్భజన్ సింగ్ కాస్త ఘాటు గానే స్పందించాడు. ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ కెప్టెన్ గా పేరుపొందిన మహేంద్ర సింగ్ ధోనితో ఎక్కువ అనుభవం లేని ఆటగాడిని పోల్చడం సరైనది కాదు అంటూ హర్భజన్ సింగ్ విమర్శించాడు. రిజ్వాన్ బ్యాటింగ్ సత్తాను తక్కువ చేయను. కానీ ధోనితో సరితూగే ప్లేయర్ మాత్రం అతను కాదు అంటూ స్పష్టం చేశాడు. ఈ రోజుల్లోనూ ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం ఏంటో.. రిజ్వాన్ కంటే ధోని చాలా ముందు ఉన్నాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు నిజాయితీగా సమాధానం ఇవ్వాలి. రిజ్వాన్ ఆట నేను కూడా ఇష్టపడతా.. నిబద్ధతతో ఆడేందుకు ఎల్లవేళలా ప్రయత్నిస్తాడు. అయితే ధోనితో రిజ్వాను పోల్చడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇప్పటికీ ప్రపంచ క్రికెట్లో ధోనినే నెంబర్ వన్. వికెట్ల వెనుక అంత చురుగ్గా వ్యవహరించిన వికెట్ కీపర్లు చాలా అరుదు. అందులో ధోనినే టాప్ అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.